హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లాడిన జపాన్ జంట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Japanese Couple
హైదరాబాద్: ఓ జపాన్ జంట హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. జపాన్‌కు చెందిన యోషిహికో (32), నమికో (26) ఆదివారం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 1లోని హనుమాన్ దేవాలయం సత్యనారాయణస్వామి ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో నవ దంపతులు వెలిగిపోయారు.

వరుడు పట్టు దోతి, లాల్చి, బాషింగం కట్టుకోగా వధువు తెల్లటి చీరపై సంప్రదాయ నగలు పెట్టుకొని చేతిలో కొబ్బరి బొండాం పెట్టుకొని అచ్చ తెలుగు సంప్రదాయంలో వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వధూవరులు ఇద్దరు ఎలక్ట్రికల్ ఇంజనీర్‌లు. యోషిహికో జపాన్‌లోని నగోయా కంపెనీలో పనిచేస్తున్నాడు.

వీళ్లిద్దరూ హిందూ వివాహం చేసుకోవాలని ఇక్కడి తెలుగు వారిని సంప్రదించారు. దాంతో అసభాను టెక్నాలజీస్ నిర్వాహకులు వీరికి సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. పెళ్లి కుమార్తెగా ముస్తాబైన నమికోను బుట్టలో ఎత్తుకొని పెళ్లి పీటల వరకు తీసుకువచ్చారు.

అనంతరం వేద పండితులు శ్రీకాంత్ శర్మ, రాయప్రోలు మల్లికార్జున శర్మలు వివాహ తంతును నిర్వహించారు. వధూవరులిద్దరూ పోటీపడి తలంబ్రాలు పోసుకున్నారు. అంతకుముందు వధువుతో పండితులు గౌరీ పూజ, వరుడితో గణపతి పూజ చేయించారు. అనంతరం వరపూజ, కన్యాదానం, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోతికంగా జరిగాయి.

ప్రాజెక్టు పని పైన హైదరాబాద్ వచ్చిన వీరు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. మానవీయ సంబంధాలు హిందూమతంతో ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని భావించారు.

English summary
A Japanese couple tied the knot in Hyderabad, in Hindu style to send a message of peace and harmony to the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X