జానా పిటిషన్‍పై నిర్ణయం వాయిదా, అక్బర్‌ది 28న

ఇది విచారణార్హమా లేదా అనే విషయంపై ఈ రోజు వాదనలు జరిగాయి. కోర్టు వాదనలు విన్నది. పిటిషన్ పైన విచారణకు అనుమతి ఇవ్వాలా లేదా అనే నిర్ణయాన్ని న్యాయస్థానం వాయిదా వేసింది. కాగా, ఇది ప్రజాప్రయోజనం కాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో అడ్వోకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థ విఫలమైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవన్నారు. కాగా, మంత్రి హోదాలో జానా రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ పీపుల్స్ మూవ్‌మెంట్ ఎగైనెస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్స్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. కేసు వాదనల సందర్భంగా ఐటి శాఖను ప్రతివాదిగా చేర్చి నోటీసు జారీ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. కాగా, అలాగే జానా రెడ్డి ఆస్తుల కేసు విచారణను వేరే బెంచ్‌కు బదలీ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అక్బరుద్దీన్ సభ్యత్వ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభ్యత్వ రద్దు పిటిషన్ పైన విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బర్ సభ్యత్వంతో పాటు మజ్లిస్ పార్టీని రద్దు చేయాలని జనార్ధన్ గౌడ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ముందుకు పెన్నా ప్రతినిధులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెన్నా కంపెనీ ప్రతినిధులు మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఎదుట హాజరయ్యారు. సిబిఐ అధికారులు పెన్నా ప్రతినిధులను విచారిస్తున్నారు.
శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ పైన..
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ కేసులో శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ పైన నిర్ణయాన్ని సిబిఐ కోర్టు ఈ నెల 30వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications