వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ 'పాలసీ'లపై మంత్రుల ఎదురుదాడి, యాత్రపై డికె

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy - YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన శాసన సభలో మంత్రులు ఎదురు దాడికి వెనక్కి తగ్గడం లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుండి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని పథకాలను కాంగ్రెసు పార్టీవిగా కాకుండా వైయస్‌విగా చెబుతున్నారు. వైయస్ ప్రారంభించిన పథకాలు కాంగ్రెసు పార్టీవే అని ఆ పార్టీ నేతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మంత్రులు జగన్ పార్టీపై సభలోనే మరోసారి తూర్పారపడుతున్నారు.

సోమవారం విద్యుత్ విషయంలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ సంక్షేమ పథకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన ఖాతాలో వేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనల మేరకే నాడు వైయస్ పథకాలను ప్రవేశ పెట్టారని, పథకాలు కాంగ్రెసు పార్టీవే కానీ ఏ ఒక్కరికి చెందినవి కాదని ఆయన అన్నారు.

వైయస్ కాంగ్రెసు నేత అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను తమ పథకాలుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పుకోవడంతోనే ఆ పార్టీ తీరు ఏమిటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంక్షోభానికి వైయస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెసు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. టిడిపి విమర్శలను అధికార పార్టీ తిప్పికొట్టినప్పటికీ వైయస్ పైన ఆ పార్టీ చేసిన విమర్శలకు అంత స్థాయిలో స్పందించలేదనే చెప్పవచ్చు.

అయితే, వైయస్ తమ నేతగా చెప్పుకునేందుకు కొంత వెనుకేసుకొచ్చినట్లు కనిపించినా పూర్తిస్థాయిలో కనిపించలేదు. వైయస్ ఇమేజ్‌ను జగన్ క్యాష్ చేసుకుంటుండడమే కారణం. మంత్రులు కొండ్రు మురళి, శైలజానాథ్‌లు మాట్లాడుతూ... వైయస్ తన హయాంలోని విద్యుత్ రుణ మాఫీని తప్పు పట్టారు. పార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలం అందరం వెళ్లి అడిగినా వైయస్ కేవలం యాభై శాతం మాత్రమే మాఫీ చేశారన్నారు. మంత్రి డికె అరుణ మాట్లాడుతూ... పాదయాత్రకు తానే ఆదర్శమని చెప్పారు. తన పాదయాత్రలో కాంగ్రెసు నేతలు పాల్గొన్నారని చెప్పారు.

English summary

 Minister Parthasarathi and other ministers on Monday dared the YSR Congress to run the party on ideology of its chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X