వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలులో 9 ముక్కలుగా 2 సూటుకేసుల్లో మృతదేహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dead body found in Vishaka train
విశాఖపట్నం: విశాఖ-హీరాకుడ్ ఎక్సుప్రెస్ రైలులో ముక్కలు చేసిన మృతదేహం కలకలం రేపింది. రెండు సూటుకేసులలో వేర్వేరు బోగీలలో ఉన్న మృతదేహాన్ని విశాఖ పోలీసులు మంగళవారం తెల్లవారుజామును రెండున్నర మూడు గంటల ప్రాంతంలో గుర్తించారు. ఎస్ 7, ఎస్ 8 బోగీలలో దీనిని గుర్తించారు. దుండగులు అత్యంత పాశవికంగా చంపేసి దానిని రెండు సూటుకేసులలో ఉంచి వేర్వేరు బోగీల్లో ఉంచారు.

మృతదేహాన్ని చూసిన పోలీసులు హత్య చేసింది ప్రొఫెషనల్స్ అని భావిస్తున్నారు. లేదంటే ఇంత కిరాతకంగా, ఇంత దారుణంగా చంపరని భావిస్తున్నారు. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మృతదేహం ఎవరిది అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. ముఖ కవళికలను బట్టి మృతదేహం ఒరిస్సాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి రెండు సూటుకేసులలో పెట్టారు.

గతేడాది విశాఖ రైల్వేస్టేషన్‌లో గన్నీ బ్యాగులో పదకొండు ముక్కల బాడీ దొరికిన విషయం తెలిసిందే. ఈ కేసు చిక్కు ముడి వీడకముందే తాజాగా మరో మృతదేహం ముక్కలుగా దొరకడం కలకలం రేపింది. గతంలో దొరికిన మృతదేహంతో పాటు ప్రస్తుతం దొరికినది కూడా ఒరిస్సాకు చెందినదిగానే పోలీసులు భావిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలి సమీపంలో ఆర్టీసి బస్సు - సుమో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

అగ్ని ప్రమాదం.. యువకుడి మృతి

మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బెజుగాంలో ఊరంతా విద్యుదాఘాతం చోటు చేసుకుంది. దీంతో మహేష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. విద్యుత్ పంప్ సెట్ స్విచ్ ఆన్ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్ షాక్ కొడుతోందని గ్రామస్థులు చెప్పారు. అధికారులు విద్యుత్‌ను నిలిపేశారు.

English summary
Vishakapatnam Police found a dead body in Vishaka-Hirakud express train on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X