వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఫామ్‌హౌస్‌లో బిఎస్పీ నాయకుడి కాల్చివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

New Delhi
న్యూఢిల్లీ: ఢిల్లీ ఫామ్‌హౌస్‌లో బిఎస్పీ నేత దీపక్ భరద్వాజ్‌ను దారుణంగా కాల్చి చంపారు. అతను 2009 లోకసభ ఎన్నికల్లో బిఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. దక్షిణ ఢిల్లీలోని రాజోక్రిలో గల తన ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో దీపక్ భరద్వాజ్‌పై దుండగులు కాల్పులు జరిపారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దీపక్ భరద్వాజ్ ఆ తర్వాత మరణించారు. గుర్తు తెలియని సాయుధ దుండగులు ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. నల్ల కారులో ఫామ్‌హౌస్‌లో చొరబడి, దీపక్ భరద్వాజ్ ఎక్కడున్నాడో తెలుసుకుని హత్య చేశారు.

లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన సంపన్నుల్లో దీపక్ భరద్వాజ్ ఒక్కరు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన 600 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో ఆయనకు హోటల్ బిజినెస్, విద్యా వ్యాపారం ఉన్నాయి. అంతేకాకుండా టౌన్‌‌షిప్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

ఫామ్‌హౌస్‌లోకి వచ్చి 62 ఏళ్ల దీపక్ భరద్వాజ్‌పై కాల్పులు జరిపినవారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. దీపక్ భరద్వాజ్‌తో నల్ల స్కోడా కారులో వచ్చిన వారు వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపి పారిపోయారని తెలుస్తోంది. కాల్పుల్లో భరద్వాజ్ అనుచరుడు గాయపడ్డాడు. కాల్పులు జరిపినవారు భరద్వాజ్‌కు తెలిసినవారే అయి ఉంటారని పోలీసులు అంటున్నారు.

భారీ గేట్ల వద్ద భద్రతా సిబ్బంది ఎప్పుడూ కాపలా కాస్తుంటారని, తెలియనివారు ఫామ్‌హౌస్‌లోకి వచ్చే అవకాశం లేదని వారు చెబుతున్నారు. రాజోక్రి ప్రాంతంలో భరద్వాజ్‌కు పెద్ద యెత్తున భూములు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Deepak Bhardwaj, a BSP politician who had contested the 2009 Lok Sabha polls, was shot during a firing at his farmhouse in Rajokri in South Delhi on Tuesday morning. A critically injured Bhardwaj later succumbed to his injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X