• search

వారు ఆడితే ఐపిఎల్ మ్యాచ్‌లు జరగనివ్వం: జయలలిత

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Jayalalithaa
  చెన్నై: తమిళనాడులో శ్రీలంక ఆటగాళ్లు ఐపిఎల్-6 మ్యాచులు ఆడితే ఆ మ్యాచులు జరగనిచ్చేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం చెప్పారు. ఏప్రిల్ 3వ తేది నుండి ఐపిఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఈ రోజు లేఖ రాశారు. చెన్నైలో శ్రీలంక ఆటగాళ్లు ఆడవద్దని అందులో పేర్కొన్నారు.

  శ్రీలంక ఆటగాళ్లు చెన్నైలో ఆడితే తాము ఐపిఎల్-6 మ్యాచులను జరగనిచ్చేది లేదని పేర్కొన్నారు. శ్రీలంక ఆటగాళ్ల పైన తమిళనాడు వ్యాప్తంగా అందరిలోను ఆగ్రహం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైలో శ్రీలంక ఆటగాళ్లు ఆడితే శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చునని పేర్కొన్నరు. శ్రీలంక ఆటగాళ్లు అడితే మ్యాచులను నిలుపు చేస్తామని చెప్పారు. శ్రీలంక జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులను ఆపేలా చర్యలు చేపట్టాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.

  మరోవైపు, తమ జట్టు నుంచి ఇద్దరు శ్రీలంక క్రికెటర్లను డ్రాప్ చేయడానికి ఐపియల్ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఏర్పాట్లు చేసుకుంది. నువాన్ కులశేఖర, అకిల ధనంజయలను తప్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) ఆరో ఎడిషన్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వాన్ని సంతోషపెట్టే చర్యలో భాగంగా శ్రీలంక ఆటగాళ్లను తప్పించాలని చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

  శ్రీలంక తమిళుల సమస్యపై తమిళనాడులో ఆందోళనలు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో శ్రీలంక ఆటగాళ్లు రాష్ట్రంలో జరిగే ఐపియల్ మ్యాచుల్లో ఆడడానిని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడించవద్దని ఫ్రాంచైజీలకు సూచించే స్థితిలో ఐపియల్ కమిషన్ లేదు. చెన్నై తమ సొంతంగానే ఇద్దరు ప్లేయర్లను తప్పించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లను మొత్తం ఐపియల్ ఎడిషన్ నుంచి తప్పించింది.

  చెన్నైలో ఆడాలంటే ఆ మాత్రం త్యాగం చేయక తప్పదనే ఉద్దేశానికి చెన్నై సూపర్ కింగ్స్ వచ్చినట్లు అర్థమవుతోంది. చెన్నైలో తొలి ఐపియల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 6వ తేదీన జరుగుతుంది. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర, లాసిత్ మలింగ, ఆంజిలో మాథ్యూస్, అజంతా మెండిస్, మహేలా జయవర్ధనే వివిధ ఐపియల్ జట్లలో ఉన్నారు. సంగక్కర సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడని, మలింగ ముంబై ఇండియన్స్ జట్టులో కీలకమైన బౌలర్ అని, చెన్నైలో ఆడే మ్యాచుల్లో వారిని ఆడించవద్దని చెప్పడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  సమస్య పరిష్కారమవుతుందని బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అంటున్నారు. శ్రీనివాసన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. శ్రీలంక ఆటగాళ్లకు దేశంలో ఎటువంటి ముప్పు లేదని శ్రీనివాసన్ అన్నారు. తమిళనాడు ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడగలదని ఆయన అన్నారు. చెన్నైలో జరగాల్సిన మ్యాచులను ఇతర ప్రాంతాలకు మార్చాలని ఏ జట్టయినా అడిగిందా అని ప్రశ్నిస్తే ఆ విషయం తనకు తెలియదని శ్రీనివాసన్ సమాధనమిచ్చారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  
 Tamil Nadu Chief Minister J Jayalalithaa has written to the Prime Minister stating categorically that the 12 Sri Lankan cricketers in the Indian Premier League will not be allowed to play matches held in Chennai.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more