జగన్ కేసు: పెన్నా ప్రతాపరెడ్డిని విచారిస్తున్న సిబిఐ

వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో, భారతి సిమెంట్స్‌లో పెన్నా ప్రతాపరెడ్డి పెద్ద యెత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన రంగారెడ్డి, కర్నూలు జిల్లాల్లో ఆయన గనుల లీజును పొందినట్లు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు వద్ద 1500 ఎకరాల సున్నంరాయి గనులను గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పెన్నా ప్రతాపరెడ్డికి కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
పెన్నా ప్రతాపరెడ్డికి చెందిన పయనీర్ ఇన్‌ఫ్రా జగతి పబ్లికేషన్స్‌లో 20 కోట్ల రూపాయలు, పెన్నా సిమెంట్స్ గ్రూప్ 45 కోట్లు రూపాయలు, కార్మెల్ ఆసియా హోల్డింగ్స్‌లో 23 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ప్రతాపరెడ్డి సంస్థలకు నీటి కేటాయింపులు కూడా వైయస్ ప్రభుత్వం జరిపినట్లు చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చెప్పుకునే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావును సిబిఐ అధికారులు ఇటీవల ప్రశ్నించారు. కెవిపి వైయస్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో కెవిపిని సిబిఐ సాక్షిగానే విచారించింది. అయితే, దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు కెవిపిని సిబిఐ ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications