పొన్నాలకి పయ్యావుల తెచ్చిన 'శివమణి ఫోన్' తిప్పలు

అంతలోనే టిడిపి నేత పయ్యావుల కేశవ్ లేచి.. పొన్నాల ఫోన్ చేయమన్నాడని చెప్పి ఆయనకు చెందిన రెండు ఫోన్ నెంబర్లను వెంటనే సభా ముఖంగా ప్రకటించాడు. ఇక అప్పటి నుండి పొన్నాల లక్ష్మయ్యకు ఫోన్‌ల మీద ఫోన్‌లు వస్తున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఆయనకు ఫోన్లు వస్తున్నాయట. ఈ ఎడతెరిపి లేకుండా వస్తున్న ఫోన్‌లతో ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.
పగలే కాదు.. రాత్రి సమయాల్లోను ఫోన్‌లు చేస్తున్నారట. విద్యుత్ సమస్య కోసం ఫోన్ చేయమని చెబితే కొందరు తమ వ్యక్తిగత సమస్యలు కూడా చెప్పుకుంటున్నారట. ఇవన్నింటిని వినలేక, ఫోన్ల మీద ఫోన్లు వస్తుండటంతో వాటిని ఎత్తలేక వాటిని స్విచ్ఛాఫ్ చేశారట. నిన్న మొన్నటి వరకు ఆయనకు చాలా ఫోన్లు వచ్చాయట. ఒకాయన ఫోన్ చేసి
గత మంగళవారం విద్యుత్ సమస్యపై పొన్నాల మాట్లాడుతూ... ఎక్కడైనా పంటలు ఎండే పరిస్థితి ఉంటే తమ దృష్టికి తేవాలని, అధికారులకు తెలియజేయాలని, అవసరమైతే ఎస్సెమ్మెస్ చేయాలని అన్నారు. వెంటనే లేచిన పయ్యావుల పొన్నాల ఫోన్ నెంబర్లను ఇచ్చారు. అప్పటి నుండి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పొన్నాల మాట్లాడుతూ.. తనకు ఫోన్ చేస్తే సమస్య తీరదని అధికారులకు చెప్పాలని కూడా ప్రకటించారు.












Click it and Unblock the Notifications