ఇక్కడకొస్తే చంపేస్తాం: అంబటి రాంబాబుకు బెదిరింపులు

గత పదిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అంబటి రాంబాబు సెల్ ఫోన్‌కు ఫోన్ చేసి సత్తెనపల్లిలో అడుగుపెడితే చంపేస్తామని రావద్దని హెచ్చరిస్తున్నారు. అంబటి రాంబాబుకు బెదిరింపుల వెనుక సొంత పార్టీకి చెందిన నేతలే ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన తన కసరత్తును ప్రారంభించారు. సత్తెనపల్లి టిక్కెట్ కోసం ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మల చెవుల్లో ఆయన వేశారట.
ఇదే టిక్కెట్ కోసం సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానికులు ఆశిస్తున్నారు. స్థానికేతరుడైన అంబటి రాంబాబుకు టిక్కెట్ ఇవ్వవద్దని, స్థానికులమైన తమకే ఇవ్వాలని పలువురు మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారెవరైనా బెదిరింపు కాల్స్ చేసి ఉంటారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications