యువతితో రాసలీలలు, దొరికిపోయిన బిజెపి ఎమ్మెల్యే

2004, 2006, 2008 శాసనసభ ఎన్నికల్లో ఉడిపి నుంచి వరుసగా మూడుసార్లు కె, రఘుపతి భట్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఆయన గతంలోనూ పలు వివాదాల్లో కూరుకున్నారు. ఆయన భార్య పద్మప్రియ ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో రఘుపతి భట్‌పై కూడా ఆరోపణలున్నాయి.
ఓ ఆర్థిక సంస్థను నిర్వహిస్తున్న రఘుపతిభట్ స్థానికంగా ఉన్న తన కార్యాలయంలో పనిచేసే యువతులతో అశ్లీల కార్యకలాపాలు నిర్వహించినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఉడిపి శివారులో కొద్దికాలం కిందట రేవ్ పార్టీ నిర్వహించిన రఘుపతిభట్‌పై శాసనసభలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
తాజాగా రఘుపతి కామకేళిలో మునిగి తేలే సిడీలు బయటపడ్డాయి. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు తన వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకీడ్చాయని ఎమ్మెల్యే రఘుపతిభట్ మండిపడ్డారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. కాగా, ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఆచితూచి స్పందించింది. ఎమ్మెల్యే రాసలీలల సీడీని క్షుణ్ణంగా పరిశీలించాక తగిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.
ఈ ఘటన ప్రభావం ఎన్నికలపై ఎంతమాత్రం ఉండదనే ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశముందన్నారు. గతంలో జరిగిన ఉడిపి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బిజెపి ఈ తాజా పరిణామంతో శాసనసభ నియోజకవర్గాన్ని కూడా ఎక్కడ కోల్పోవాల్సి వస్తోందనని ఆందోళన చెందుతోంది.
కర్ణాటకలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత అవినీతి ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయో, కామకేళి పురాణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. బిజెపికి చెందిన మంత్రి రేణుకాచార్య ఓ నర్సుతో అక్రమ సంబంధం కేసులో ఇరుక్కోగా, మరో మంత్రి హాలప్ప తన స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు.
శాసనసభ సమావేశాల సాక్షిగా తమ మొబైల్స్‌లో నీలి చిత్రాలు వీక్షిస్తూ ముగ్గురు మంత్రులు పదవులను కోల్పోయారు. వీరంతా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుచరులే కావడం ఈ సందర్భంగా గమనార్హం. తాజాగా రఘుపతిభట్ వ్యవహారం బయటపడింది.












Click it and Unblock the Notifications