మద్దుతు రద్దు లేదు, పిఎం కావాలని లేదు: ములాయం

సంబంధాలు చెడిపోలేదని, ప్రధాని ఏ ప్రాతిపదికపై ఆ వ్యాఖ్యలు చేశారో తెలియడం లేదని, యుపిఎకు మద్దతు ఉపసంహరించుకునే విషయంపై ప్రస్తుతం పార్టీలో చర్చ జరగలేదని, యుపిఎకు తమ పార్టీ మద్దతు ఉపసహంరించుకునే ప్రసక్తి లేదని ఆయన వివరించారు. కేవలం ఎనిమిది, తొమ్మిది నెలలు మాత్రమే ఉన్న స్థితిలో మద్దతు ఉపసంహరించుకుని ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతామని ఆయన అడిగారు
ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, మధ్యంతర ఎన్నికలు ఖాయమని బిజెపి వ్యాఖ్యానించింది. గుజరాత్, తమ పార్టీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పోల్చి వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో అమలవుతున్న కార్యక్రమాల జాబితా ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు గుజరాత్‌లో అమలు అవుతున్నాయా అని ఆయన అడిగారు.
తృతీయ ఫ్రంట్ ఏర్పడడం ఖాయమని, దేశంలో పరిస్థితులను బట్టి కూటములు ఏర్పడతాయని, 2014 తర్వాత తృతీయ కూటమిదే అధికారమని ఆయన అన్నారు. మీరు కూటమికి నాయకత్వం వహిస్తారా అని అడిగితే దాని గురించి తర్వాత ఆలోచిస్తామని ఆయన జవాబిచ్చారు. మీరు ప్రధాని కావాలని కోరుకుంటున్నారా అని అడిగితే తాను ఏ రోజూ అలా అనుకోలేదని, ఇప్పుడు కూడా ఆ ఆలోచన చేయడం లేదని ఆయన అన్నారు.
మద్దతు తెలిపే పార్టీలను కాంగ్రెసు మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. కరుణానిధి యుపిఎకు మద్దతు ఇచ్చారని, ప్రభుత్వంలో చేరారని, డిఎంకె మంత్రిని ట్రాప్ చేసి జైలుకు పంపించారని ఆయన అన్నారు. రాజాను 2జి స్కామ్ కేసులో జైలుకు పంపించడాన్ని ఆయన ఉద్దేశించారు.












Click it and Unblock the Notifications