టిడిపి ఎమ్మెల్యేలతో దీక్ష విరమింపజేసిన భువనేశ్వరి

పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ శానససభ్యులను శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేరని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
క్షేత్రస్థాయిలో విద్యుత్తు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. శనివారం మధ్యాహ్నం తాము కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు.
రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ శాసనసభ్యుల దీక్షను భగ్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలు ఎందుకు కష్టాలు భరించాలని ఆయన అడిగారు.
దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను శుక్రవారం సాయంత్రం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పరామర్సించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ తర్వాత శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను నిమ్స్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications