తప్పులు సవరించుకుంటాం, ముందుకే: కోడందరామ్

సడక్ బంద్ లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. సడక్ బంద్ సమయంలో కొంత సమన్వయలోపం ఉన్నమాట నిజమేనని ఆయన అన్నారు. తప్పులు సవరించుకుని ముందుకు సాగుతామని ఆయన అన్నారు.
ఏప్రిల్ 3వ తేదీన తెలంగాణ జెఎసి విస్తృత సమావేశం జరుగుతుందని, అప్పుడు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు. విజయవాడ సడక్ బంద్, ఛలో అసెంబ్లీ తేదీలను కూడా అప్పుడే నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఉద్యమ నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకుంటామని ఆయన చెప్పారు.
ఇటీవల చేపట్టిన కర్నూలు సడక్ బంద్ సందర్భంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన సందర్భంగా జరిగిన ఓ సంఘటనకు బాధ్యులను చేస్తూ కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, కావేటి సమయ్య తదితరులపై పోలీసులు కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. బెయిల్‌పై వారు విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications