క్షీణించిన ఆరోగ్యం: అర్థరాత్రి టిడిపి దీక్ష భగ్నం

నిబంధనల ప్రకారం పోలీసులు అంతకుముందే స్పీకర్ అనుమతి తీసుకున్నారు. సుమారు 150 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టిడిపి కార్యకర్తలు పోలీసులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. వీరిని పక్కకు తప్పించిన పోలీసులు దీక్షలో ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వివిధ ఆస్పత్రుల నుంచి తెప్పించిన అంబులెన్సుల్లో వారిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రభుత్వ తీరును ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యపై దీక్షకు దిగిన తమను అర్ధరాత్రి వేళ అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఆస్పత్రిలో కూడా దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శనివారం అన్ని మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తామన్నారు. స్పీకర్ నుంచి అనుమతి రావడంలో ఆలస్యమైనందునే అర్ధరాత్రి అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో సహా మొత్తం 29 మంది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. వీరిలో 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ సీఎం రమేశ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారు. వీరిలో మహిళా ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సీతక్కల పరిస్థితి శుక్రవారం ఆందోళనకరంగా మారింది. కూర్చునే ఓపిక కూడా లేక వీరిద్దరూ పూర్తిగా పడుకొనే ఉంటున్నారు. సత్యవతి పలుమార్లు వాంతులు చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications