కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖలీల్ బాషా ప్రవేశం: కడప టిడిపిలో విభేదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
కడప: కడప నగర తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ ఖలీల్ బాషా శంకరాపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆ ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖలీల్‌బాషా, నగర అధ్యక్షుడు బాలకృష్ణయాదవ్, ఉపాధ్యక్షుడు గాజుల హాజీ, రమణ, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఇదిలావుండగా కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అమీర్‌బాబు, సుబాన్ బాషా, గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేరుగా ఆవిర్భావం దినోత్సవం జరిపారు. లవకుశ సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ సీనియర్ అభిమానులకు బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు పీరయ్య ఆధ్వర్యంలో ఆల్‌షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలకు అన్నదానం చేశారు.

మాజీ మంత్రి ఖలీల్ బాషా గత కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు డాక్టర్ ఖలీల్ బాషాను కడప నియోజక వర్గ ఇన్‌చార్జిగా నియమించే అవకాశాలు ఉండడంతో ఆయన తిరిగి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మారుతున్నారు.

డాక్టర్ ఖలీల్ బాషా రాకతో తెలుగుదేశం పార్టీలో ఒక వర్గానికి మింగుడు పడడం లేదు. దీంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో కడప నియోజక వర్గం తెలుగుదేశం పార్టీలో తెలుగుతమ్ముళ్ల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నాయకుల పెడధోరణులతో కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారు.

English summary
Differences among the Telugudesam party leaders in Kadapa district. The reentry of Khaleel basha created trouble in Kadapa TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X