వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిటీలో లేను: అవిశ్వాసంపై తగ్గిన చిన్నం రామకోటయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinnam ramakotaiah
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం సమయంలో తన ఆరోగ్యం బాగా లేదని, తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య ఆదివారం అన్నారు. అవిశ్వాసం తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించారంటూ టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో స్పీకర్ టిడిపి ఎమ్మెల్యేలు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేశారు. కాంగ్రెసు కూడా ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మొత్తం రెండు పార్టీలకు చెందిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నిన్న నోటీసులు జారీ చేశారు. అందులో నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య పేరు కూడా ఉంది. దీంతో ఆయన ఈ రోజు స్పందించారు.

తెలుగుదేశం పార్టీ తనకు ఎలాంటి విప్ జారీ చేయలేదని, తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎక్కడా పాల్పడలేదని చిన్నం రామకోటయ్య టిడిపి విప్ దూళిపాళ్ల, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేఖలు రాశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో తాను హైదరాబాదులో లేనని, తన ఆరోగ్యం బాగా లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనపై పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన అందులో కోరారు.

వెనక్కి తగ్గారా?

2009లో టిడిపి తరఫున గెలిచిన చిన్నం మొదట జగన్ పార్టీలోకి వెళ్తారని భావించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు వైపుకు వెళ్లారు. అయితే, విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో అధికార పార్టీ తీవ్రమైన ఇరకాటంలో పడింది. దీంతో ఆయన అధికార పార్టీకి మద్దతిచ్చే అంశంపై పునరాలోచించుకున్నారా? లేక ఉప ఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేకనే విప్ ధిక్కరించలేదని చెప్పారా? అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో బాబు పాదయాత్ర నేపథ్యంలో టిడిపి క్రమంగా పట్టు బిగుస్తోంది.

English summary
Krishna district Nuziveedu MLA Chinnam ramakotaiah has wrote a letter to Speaker Nadendla Manohar and TDP whip Dulipalla Narendra that he was not participated in anti party activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X