కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

చిత్తూరు: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. శనివారం రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కేంద్రమంత్రి జైరామ్ రమేష్‌తో కలిసి శ్రీవారిని దర్సించుకున్నారు. అనంతరం కిరణ్ తలనీలాలు సమర్పించారు. వైకుంఠం ద్వారా ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి తదితరులతో ఆలయ ప్రవేశ ద్వారానికి చేరుకున్నారు.

ఆలయం వద్ద తితిదే చైర్మన్ కనుమూరి బాపిరాజు, కార్య నిర్వహణాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్య నిర్వహణాధికారి శ్రీనివాస రాజు,సివిఎస్‌వో అశోక్ కుమార్‌లు వారికి స్వాగతం పలికారు. వేద పండితులు వారిని ఆశీర్వదించారు. శ్రీవారి దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. చైర్మన్, ఈవోలు వారికి ప్రసాదం అందజేశారు.

వకుళామాత, విమాన వేంకటేశ్వర స్వామిని దర్సించుకొని హుండీలో కానుకలు వేశారు. ఆ తర్వాత వారు శుభప్రదం కరదీపికలను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రే కాకుండా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి ఎన్ వి రమణ, మంత్రి సునీత లక్ష్మా రెడ్డిలు నిన్న, ఈ రోజు వివిఎస్ లక్ష్మణ్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు.

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ముఖ్యమంత్రి. పక్కన జైరామ్ రమేష్, కనుమూరి బాపిరాజు

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కిరణ్

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ..

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

వేదపండితుల ఆశీర్వాదం

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

వరుసలో(క్యూలైన్లో)

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

ద్వజ స్తంభం వద్ద

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో న్యాయమూర్తి

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

ఆలయంలో కనుమూరి బాపిరాజు, ఎల్వీ సుబ్రహ్మణ్యంతో న్యాయమూర్తి

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

న్యాయమూర్తి కుటుంబానికి శ్రీవారి పటాన్ని ఇస్తున్న సిబ్బంది

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

మొక్కుతున్న న్యాయమూర్తి

కిరణ్ తలనీలాలు: శ్రీవారి సేవలో ప్రముఖులు(పిక్చర్స్)

ఆశీర్వాదం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+