వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో చూసి రండి: కిరణ్‌కి నాగం, బిజెపికి మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుజరాత్ వెళ్లి స్వయంగా చూస్తే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కరెంట్ ఎంత బాగుందో అర్థమవుతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం అన్నారు. విద్యుత్ కోతలపై బిజెపి చేస్తున్న దీక్షకు నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోదన్నారు. గుజరాత్ వెళ్లి సిఎం స్వయంగా చూడాలని సూచించారు. అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడితేనే ఈ సంక్షోభం నుండి గట్టెక్కగలమని ఆయన అన్నారు.

కాగా, విద్యుత్ అంశంపై బిజెపి నేతల నిరవధిక నిరాహార దీక్ష శనివారం ప్రారంభమైంది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష చేపట్టారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలను ఉపసంహరించుకునేవరకు ఈ పోరు దీక్షను కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సాయంత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షలను పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.

విద్యుత్తు విధానం విషయంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈఆర్‌సీ ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మగా మారిందని ఆయన విమర్శించారు. ఈ చార్జీల పెంపు సీఎం కిరణ్ పతనానికి దారితీస్తుందని ఆగ్రహించారు. చార్జీల విషయంలో ప్రజలపక్షాన నిలవాల్సిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు విడిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని, సిద్ధాంతాలు వేరైనా... ప్రజా సమస్యలపై కలిసి కట్టుగా పోరాడుతామని హెచ్చరించారు.

English summary
Telangana Nagara Samithi Chairman and Nagarkurnool MLA Nagam Janardhan Reddy has suggested CM Kiran Kumar Reddy on power cuts in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X