అక్కడ టిడిపితో కలిసే సిపిఐతోను పొత్తుండదు: కెసిఆర్

ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చని, కేంద్ర సర్కారు ఎప్పుడైనా పడిపోవచ్చని, ఆ మరుక్షణమే రాష్ట్రంలోనూ సర్కారు పడిపోతుందని చెప్పారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించటానికి ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సిద్ధంగా ఉన్నారని, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్రానికి మద్దతు ఇవ్వటానికి సుముఖంగా లేరని, దీంతో కేంద్రం రేపో మాపోకూలవచ్చునని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే తెరాసకు 13 ఎంపి స్థానాలు ఖాయమని చెప్పడాన్ని ఈ సమయంలో ఆయన ప్రస్తావించారు. మనకు క్షేత్రంలో అంతా అనుకూలంగా ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏప్రిల్ 10లోపు కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, ఖమ్మం మినహా మిగిలిన 15 లోక్‌సభ స్థానాల్లో తెరాస గెలుస్తుందని జోస్యం చెప్పారు.
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో పార్టీ పరంగా కొంత బలహీనంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. బస్తీ బాట ద్వారా ఈ లోటును భర్తీ చేసుకోవాలని కోరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో 13 లోక్‌సభ స్థానాలు ఖాయమని తేలిన దరిమిలా ఎంత లేదన్నా 80-90 అసెంబ్లీ స్థానాలు తెరాసకే దక్కుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తెలంగాణ భవన్‌కు వచ్చి మరీ వాళ్లే తెలంగాణ ఇచ్చి పోతారని వ్యాఖ్యానించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోనూ కష్టపడితే 15 లోక్‌సభ స్థానాలు తప్పక గెలుస్తామన్నారు. వచ్చేది సంకీర్ణ యుగమని, కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని, వచ్చే 20 ఏళ్లు మనవే అని కెసిఆర్ చెప్పారని సమాచారం. కాగా, సమావేశం వివరాలను అనంతరం నాయిని, వినోద్ కుమార్ మీడియాకు తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ వివిధ పార్టీలు ఏప్రిల్ 9న జరపతలపెట్టిన బంద్‌లో తమ పార్టీ శ్రేణులూ పాల్గొంటాయని తెలిపారు.












Click it and Unblock the Notifications