పెద్దిరెడ్డి ఏకాకి: వీరశివా, చిరుతో కల్సి వెళ్తా: రఘువీరా

ప్రతిపక్షాలు చెప్పినట్లుగా రాష్ట్రంలో విద్యుత్ లేక ఎక్కడా ఎకరం పొలం ఎండలేదని ఆయన అన్నారు. విద్యుత్ లేక పొలం ఎండిందని విపక్షాలు చెప్పడం సరికాదన్నారు. బోర్లలలో నీళ్లు లేక పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్ లేక మాత్రం కాదన్నారు.
చిరుతో కలిసి ప్రచారం చేస్తా: రఘువీరా
త్వరలో కర్నాటకలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో తాను కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేస్తానని మంత్రి రఘువీరా రెడ్డి వేరుగా చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో కలిసి తాను ప్రచారంలో పాల్గొంటానని ఆయన చెప్పారు. కర్నాటకలో తమకు సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. సామాన్యులపై విద్యుత్ భారం పడకుండా ఉండేలా తమ ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆయన చెప్పారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెసు నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు బాధాకరమని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలపై భారం తగ్గేలా ఆలోచించాలని కోరారు. పొంగులేటితో పాటు పూల రవీందర్, గాదె శ్రీనివాసులు, బొడ్డు నాగేశ్వర రావు, కోలగట్ల వీరభద్ర స్వామి, లక్ష్మీ శివకుమారి, సంతోష్ కుమార్, శమంతకమణిలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications