వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు దార్లోనే కిరణ్: షర్మిల, సెక్యూరిటీ అత్యుత్సాహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
విజయవాడ: పార్టీ అధ్యక్షుడైన తన సోదరుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కలలను నెరవేర్చుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల శనివారం అన్నారు. ఆమె వస్తున్నా మీకోసం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేకే కాంగ్రెసు ఆయనను జైలులో పెట్టించిందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పార్టీకి సలహాదారుడుగా ఉన్నారని విమర్శించారు. బోనులో ఉన్నా సింహం సింహమేననే విషయం వారు గుర్తుంచుకోవాలన్నారు. టిడిపి హయాంలో ఎనిమిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఈ దొంగ దీక్షలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు చంద్రబాబు దారిలోనే నడుస్తోందన్నారు.

చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా చిన్నబోతుందని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా వైయస్ రాజశేఖర రెడ్డి పదమూడు రోజులు నిరాహార దీక్ష చేశారని, ఆఖరు రోజు ఆందోళన జరిగితే పోలీసులతో కాల్పులు జరిపిస్తే ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ సమయంలో బాబు.. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి కాల్పులు జరిపిన పోలీసులను పరామర్శించారని మండిపడ్డారు.

మహిళలను తోసేసిన సెక్యూరిటీ

షర్మిల పాదయాత్ర సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది అత్యూత్సాహం ప్రదర్సించారు. షర్మిల యాత్ర ఉయ్యూరుకు చేరుకున్న సమయంలో పలువురు మహిళలు తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చారు. వారికి పరాభవం ఎదురయింది. షర్మిల వద్దకు వస్తున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది పక్కకు తోసేశారు. దీంతో ఆగ్రహం చెందిన మహిళలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's sister Sharmila on Saturday said that Kiran Kumar Reddy is following TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X