నరేంద్ర మోడీకి 'కీలక' పదవి: సెంట్రల్ బోర్డులో వెంకయ్య

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇందులో చోటు లభించలేదు. పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీతో పాటు మోడీ సలహాదారుడు అమిత్ షా, మురళీధర రావులను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఉపాధ్యక్షులుగా స్మృతి ఇరానీ, ఉమా భారతిలను నియమించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలుగా సరోజ్ పాండే ఎంపికయ్యారు. పార్లమెంటరీ సెంట్రల్ బోర్డులో వెంకయ్య నాయుడుకు చోటు లభించింది. కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మురళీధర రావు స్వంత జిల్లా కరీంనగర్. క్రమశిక్షణ కమిటీలో విశాఖకు చెందిన హరిబాబుకు చోటు దక్కింది.
మోడీ ప్రధానిగా సంకేతాలు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సంకేతాలిచ్చినట్లేనని భావిస్తున్నారు. అంతేకాకుండా మోడీ సలహాదారుడు అమిత్ షాకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అధికారికంగా ప్రకటించక పోయినా 2014లో బిజెపి ప్రధాని అభ్యర్థి మోడియేననే సంకేతాలు పరోక్షంగా ఇచ్చినట్లే అంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!