టిడిపి ఓడింది... మాలో భయం: చిరంజీవి వర్గం మంత్రి

సమన్వయ కమిటీ ఉద్దేశం నెరవేరడం లేదని, పెంపును సమర్థించుకునేందుకు మాటలు చెబితే సరిపోదన్నారు. ప్రజలు వాటిని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఈఆర్సీ నిర్ణయం వెలువరుస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. 2004లో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాగే అధికారం కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తమకు కూడా అదే భయం పట్టుకుందన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు గెలవడం కష్టమే అన్నారు.
ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చినా రాజకీయ కోణంలో చూస్తారని ఎద్దేవా చేశారు. చెప్పిన మాట వినకుంటే చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే పడుతుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం ముందుకు వెళ్లి ఎలా ఓట్లు అడగాలని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ భారం పేద ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయంపై చర్చించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలకు ఇంతకు ముందే లేఖలు రాసినట్లు చెప్పారు. ఈఆర్‌సీ ఎంత స్వాతంత్ర సంస్థ అయినా ప్రభుత్వం అనుమతిలేకుండా నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. చార్జీల పెంపుతో వ్యక్తుల భవిష్యత్‌నే కాదు కాంగ్రెస్ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టారని మంత్రి రామచంద్రయ్య విమర్శించారు.
కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు పైన కేంద్రమంత్రి చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాశారు. విద్యుత్ సమస్య, చార్జీల పెంపు అంశంపై చర్చించేందుకు సత్వరమే 'సమన్వయ కమిటీ' సమావేశం ఏర్పాటు చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ ఎత్తున చార్జీలు పెంచడం వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని చిరంజీవి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications