హిందుత్వాన్ని కించపర్చి అసెంబ్లీలోకా?: పరిపూర్ణానంద

Paripoornananda Swamy
హైదరాబాద్: హిందువులను, హిందుత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన ఓ ప్రజాప్రతినిధి అసెంబ్లీలో ఉండటమా? అంటూ కాకినాడ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో విలేకరులతో మాట్లాడారు.

హిందువులను, హిందుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిన ఓ ప్రజాప్రతినిధి శాసనసభలో మళ్లీ ప్రవేశించినా ఏ ఒక్కరూ ఆయన చేసిన పనిని తప్పు పట్టకపోవడమేమిటని ఆయన అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకొని ఎవరికీ భయపడబోమని ఆ ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు.

కళంకితులు అసెంబ్లీలోకి రాకుండా చట్టాలు చేయాలని కోరారు. ప్రభుత్వం మైనార్టీల పక్షాన నిలుస్తూ ఇతరులకు రక్షణ లేకుండా చేస్తోందని ఆరోపించారు. విదేశాల నుంచి ఎన్జీవోలకు ఏటా రూ.15వేల కోట్లు వస్తున్నాయని, వాటితో మతమార్పిడిలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

చైనాలో ఎన్నికల సమయంలోనే రాజకీయం జరుగుతుందని, అనంతరం అందరూ దేశం కోసం పాటుపడుతారని, మనవద్ద కూడా నాయకులు అలా దేశభక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రజల్లో దేశభక్తి, దైవభక్తి పెంచేందుకు ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం నుంచి ఏప్రిల్ 28 వరకు శ్రీ లలితా రహస్య, సహస్రనామాలపై 86వ జ్ఞానయజ్ఞ ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+