జగన్ రిమాండ్ పొడగింపు: జప్తుపై విచారణ వాయిదా

జగన్ రిమాండ్ గడువు సోమవారంనాడు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలకు కూడా రిమాండ్ 8 వరకు పొడిగించింది.
ఇదిలావుంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రెండో విడత ఆస్తులఅటాచ్‌మెంట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సోమవారం రాంకీ గ్రూప్ కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై న్యాయప్రాధికార సంస్థలో ఇరువైపుల వాదునలు ముగిశాయి. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
పరవాడ సెజ్‌లో గ్రీన్ బెల్ట్ ఏరియాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మినిట్స్‌ను అందజేయాలని ఈడీకి న్యాయప్రాధికారిక సంస్థ ఆదేశించింది. రాంకీలో ఎపిఐఐసి కూడా భాగస్వామి అని అని చెబుతూ మరి ఎపిఐఐసి అధికారులను ఎందుకు విచారించలేదని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రశ్నించారు. దీనిపై 17న ఈడీ వాదనలు వినిపించనుంది.
కోర్టుకు హాజరైన ధర్మాన
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. జగన్ అక్రమాస్తులకు సంబలంధించి 26 వివాదాస్పద జీవోలపై ధర్మాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఒఎంసి కేసుల్లో నిందుతుల రిమాండ్‌ను కూడా కోర్టు పొడగించింది. ఎమ్మార్ కేసులో బీపీ ఆచార్య, కోనేరు ప్రసాద్, విజయరాఘవ, కోనేరు మధు సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు.
గాలి రిమాండ్ పొడగింపు
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈకేసులో నిందుతులుగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి, ఆలీఖాన్‌లను సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి ఈనెల 15 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.












Click it and Unblock the Notifications