హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాటిచ్చా: వైయస్ హామీతో బొత్సకు జగన్ పార్టీ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కౌంటర్ ఇస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బొత్స సత్యనారాయణ ఆదివారం మాట్లాడుతూ... 2004లో తాము ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చామని, 2009లో అలాంటి హామీ ఇవ్వలేదని, తమ మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీల అంశం లేదని బొత్స చెప్పారు.

దీనిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కౌంటర్ ఇచ్చింది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారని ఆ పార్టీ చెబుతోంది. 2009 ఫిబ్రవరి 9న పత్రికలలో వైయస్ ఇచ్చిన ప్రకటనను ఆ పార్టీ చూపిస్తోంది. విద్యుత్ ఛార్జీలు పెంచమని తాము 2004లో హామీ ఇచ్చామని అన్న మాట ప్రకారం ఈ ఐదేళ్లు పెంచలేదని, ఈసారి గెలిచాక మరో ఐదేళ్లు కూడా పెంచేది లేదని హామీ ఇస్తున్నానని వైయస్ అప్పుడు ప్రకటన ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది.

అందుకు సంబంధించిన ప్రకటనను కూడా విడుదల చేసింది. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీను కూడా నెరవేర్చిందని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని.. అది తమ విద్యుక్త ధర్మంగా వైయస్ అప్పుడు పేర్కొన్నారని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి హామీలకు భిన్నంగా ఈ ప్రభుత్వం వెళ్తోందంటున్నారు.

విద్యుత్ ఛార్జీలు పెంచమని వైయస్ హామీ ఇచ్చారని, తాము ఆధారాలు చూపించిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ నేత జనక్ ప్రసాద్ నిన్న డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.

English summary
YSR Congress Party is condemning PCC chief Botsa Satyanarayana's comments on power charges hike. Jagan Party leader reveals late YS Rajasekhar Reddy paper advertisement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X