వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ వాటా ఎంత?: బాబు, మీరు గడ్డంతో..: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Narayana
రాజమండ్రి/హైదరాబాద్: విద్యుత్ వ్యవస్థను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భ్రష్టు పట్టిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అంధకారంలో ముంచారని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం విమర్శించారు. ఎవరి హయాంలో విద్యుత్ పరిస్థితి దిగజారిందో తేల్చుకుందామని కిరణ్‌కు సవాల్ విసిరారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కాకినాడలోని సబ్‌స్టేషన్ వద్ద చంద్రబాబు ఒకరోజు దీక్ష సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1994 నుంచి 2013 వరకు విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిందే అన్నారు. తమ హయాంలో చార్జీల రూపేణా రూ.1600 కోట్లు పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు పెంచిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడి రాష్ట్రంలో 10 లక్షలమంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. కరెంటు కొనుగోలు అవినీతిలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల వాటా ఎంతని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి ఈ నెల 9 వరకు గడువిస్తున్నామని, బంద్‌లోగా కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాటం చేస్తామని అని వామపక్షాలు అల్టిమేటం జారీ చేశాయి. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు సామూహిక దీక్షలు చేపట్టాయి. కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు.

చంద్రబాబు విధానాల వల్లే ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని చెబుతున్నారని, ప్రతి దానికీ ఆయన పేరు చెప్పొద్దని,తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉండి ఆయన చేసిన చట్టాల్లో మీరు మార్పులు ఎందుకు చేయలేదని, చేతకాక కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బాబులాగే చేయాలనుకుంటే మీరు కూడా గడ్డం పెంచి, జనంలో, రోడ్లపై తిరగాల్సి వస్తుందని ఆక్షేపించారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu has blamed late YS Rajasekhar Reddy and CM Kiran Kumar Reddy for power crisis in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X