సిటీలో భారీ వర్షం: విజయమ్మ, బిజెపి దీక్ష కొనసాగింపు

Heavy rain in Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. శంషాబాద్, పంజాగుట్ట, సోమాజీగూడ, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్, బషీర్ బాగ్, హిమయత్ నగర్, లక్డీకాపూల్, అబిడ్స్, కోఠి, వనస్థలిపురం తదితర పలు ప్రాంతాల్లో భారీ, మోస్తారు వర్షం కురిసింది.

ఆయా ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. గాంధీ నగర్‌లో పిడుగు పడింది. ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమి కాలేదు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వర్షం కురిసిన పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేశారు.

వర్షంలోనే జగన్ పార్టీ, బిజెపి దీక్ష

విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు వర్షంలోనే తమ దీక్షను కొనసాగిస్తున్నారు. వైయస్ విజయమ్మ ఆమరణ దీక్ష ప్రారంభించగా, బిజెపి నిరవధిక దీక్ష చేస్తోంది. వారు దీక్ష చేస్తున్న ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న దీక్షను కొనసాగిస్తున్నారు.

మెదక్‌లో వడగళ్ల వాన

మెదక్ జిల్లాలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలరాలాయి. పలుచోట్ల చెట్లు కూలడం వల్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా, రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+