పండ్లు, పాలు ఇవ్వండి: ఢిల్లీ గ్యాంగ్‌రేప్ నిందితుడు

 Delhi gangrape accused wants milk, fruits in jail diet
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు నిందితుడు వినయ్ శర్మ తనకు పండ్లు, పాలు కావాలని అడిగాడు. ఈ మేరకు అతను ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సోమవారం దరఖాస్తు చేసుకున్నాడు. అతను విద్యార్థి అని, జ్యుడిషియల్ కస్టడీలో పాలు, పండ్లు ఇవ్వాలని అడిగే హక్కు ఉందని ఆ దరఖాస్తుపై ప్రతిస్పందిస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి యోగేష్ ఖన్నా అన్నారు. పండ్లు, పాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

బిఎ ప్రథమ సంవత్సరం విద్యార్థి అయిన తన క్లయింట్‌కు గ్రూప్ సి ఉద్యోగం పరీక్ష ఉందని, ఈ మేరకు అతనికి లేఖ వచ్చిందని శర్మ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి తన క్లయింట్‌కు వార్తాపత్రికలు అందుబాటులో ఉంచాలని కూడా కోరారు.

ఢిల్లీలో నిరుడు డిసెంబర్ 16వ తేదీన నడుస్తున్న బస్సులో ఓ వైద్య విద్యార్థినిపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బస్సులో ఆ తన మిత్రుడితో కలిసి వెళ్తుండగా ఆమెపై శర్మతో పాటు మిగతావారు సామూహిక అత్యాచారం జరిపారు.

అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని డిసెంబర్ 29వ తేదీన సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ సంఘటనతో ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+