వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య దాడి చేసిందని మంత్రి: వేధిస్తున్నాడని యామిని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kerala minister, wife trade torture charges
తిరువనంతపురం: గృహ హింస ఆరోపణలతో కేరళ అటవీ శాఖ మంత్రి కెబి గణేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తనను గృహ హింసకు గురి చేస్తున్నారని మంత్రి భార్య యామిని సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, భార్య నుండి విడాకులు ఇప్పించాలని కోర్టులో కేసు వేసిన కొన్ని గంటలకే మంత్రిపై గృహ హింస కింద యామిని ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో మంత్రి పదవికి గణేష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఊమన్ చాందీకి పంపించారు. కాంగ్రెసు-యూడిఎఫ్ సంకీర్ణ కూటమిలోని ప్రభుత్వంలో గణేష్ కుమార్ కేరళ కాంగ్రెసు పార్టీకి చెందినవారు. యామిని సోమవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత దశాబ్దంగా తనను వేధిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు.

యామిని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా తప్పు పట్టారు. ముఖ్యమంత్రి తన భర్తపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వెనుకేసుకొస్తున్నారని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో యూడిఎప్ కూటమిలోని కేరళ కాంగ్రెసు మూడు స్థానాల్లో గెలుపొందింది. యూడిఎప్ కూటమిలో ఇది మైనర్ పార్టనర్. 46 ఆరేళ్ల గణేష్ కుమార్ నటుడి నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. మొదట రాజీనామా చేసేందుకు గణేష్ ఒప్పుకోలేదు.

ఆ తర్వాత పట్టుబట్టడంతో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించారు. గణేష్ కుమార్ సతీమణి యామిని రాతపూర్వకంగా తన భర్త పైన ఫిర్యాదు చేశారని, కేసును చేపట్టమని డిజిపిని ఆదేశించానని చెప్పారు. కాగా, గణేష్ కూడా పోలీసు స్టేషన్‌లో ప్రతిగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం గణేష్ ఫ్యామిలీ కోర్టులో తనపై భార్య దాడి చేసిందంటూ అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Kerala's Forest Minister K.B.Ganesh Kumar handed over his resignation to Chief Minister Oommen Chandy late on Monday night after his estranged wife accused him of ill-treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X