బంధించి, మహిళపై అత్యాచారం చేసి అమ్మేసిన పూజారి

ఆమె కుమారుడిని, ఆమెను బాలప్రసాద్ శుక్లా అపహరించాడని, ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత టికంగఢ్ జిల్లాలోని పిప్రా గ్రామానికి చెందిన విమల్ యాదవ్, పప్పూ యాదవ్, వీరేంద్ర యాదవ్ అనే ముగ్గురికి 40 వేల రూపాయలకు అమ్మేశాడని ఆరోపణలు వచ్చాయి.
కనిపించకుండా పోవడంతో ఆమె కోసం ఆమె సోదరుడు గాలింపు ప్రారంభించాడు. దాంతో ఆమెను టికంగఢ్ జిల్లా పిప్రా గ్రామంలో అతను కనిపెట్టాడు. ఆమె ఐదేళ్ల కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆమెను పోలీసుల సహకారంతో రక్షించాడు.
మహిళను కొనుక్కున్న ముగ్గురు సోదరులు కూడా ఆమెను బందీగా ఉంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పూజారి, అతని అనుచురడితో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications