నీతిగా ఉంటేనే: జగన్‌పై మళ్లీ కిరణ్, ఎమ్మెల్యేలపై బొత్స

ఏ ఉద్యోగం చేసినా నీతివంతంగా బతుకుతేనే మంచిదన్నారు. నీతి, నిజాయితీ, విలువలతో కూడిన జీవితం సాగించాలన్నారు. అప్పుడే సమాజంలో ఓ గౌరవం ఉంటుందన్నారు. ఒక పద్ధతి ప్రకారం బతకాలన్నారు. సమాజం గౌరవంగా చూసే విధంగా ఉండాలన్నారు. కేవలం డబ్బు సంపాదనే జీవిత లక్ష్యం కావొద్దని సూచించారు. డబ్బు సంపాదనే లక్ష్యమైతే చాలా విలువలు కోల్పోతామన్నారు.
మానవతా విలువలు కాపాడుకుంటు కుటుంబాన్ని సక్రమంగా చూసుకోవాలన్నారు. చట్టానికి వ్యతిరేకంగా డబ్బు సంపాదిస్తే ఎవరూ గౌరవించరన్నారు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకు రాలేదని, వెళ్లేటప్పుడు ఏమీ తీసుకు పోమన్నారు. ఉన్నన్ని రోజులు సమాజంలో గౌరవంగా, పదిమంది మెచ్చేలా జీవించాలన్నారు. ఏ ఉద్యోగం చేసినా నీతిగా ఉండాలన్నారు. కాగా, అంతకుముందు సిఎం కాన్వాయ్‌ను టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఎమ్మెల్యేలపై చర్యలు
అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశామని, దానిపై స్పీకర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని బొత్స సత్యనారాయణ ప్రకాశం జిల్లాలో అన్నారు. పేద ప్రజలపై విద్యుత్ భారం పడనివ్వమన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications