పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్: ఒడిషా అభ్యంతరాలే

త్వరలోనే ఒడిషా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ తెలిపారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పైన ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు నిర్మాణం పనులు ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిషా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కేంద్రమంత్రి హరీష్ రావత్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ పర్యావరణ అభ్యంతరాలతో పాటు మూడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బ్రేక్ వేశారు.
కాగా, పోలవరం ప్రాజెక్టుకు నెల రోజుల క్రితం ముహూర్తం ఖరారు చేసి రైతులు ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల ఎనిమిదో తేదిన ఉదయం 6.57 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు తదిపరి పనులను రైతులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ చేజిక్కించుకుంది.












Click it and Unblock the Notifications