సీనియర్ ఎమ్మెల్యేల ప్లాన్: కొడుకులకు అసెంబ్లీ టికెట్లు

గుంటూరు జిల్లా బాపట్ల శానససభ్యుడు గాదె వెంకటరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తన పెద్ద కుమారుడు మధుసూదన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలకు ఆయన ఆ విషయం చెప్పారు. బాపట్ల నుంచి తన స్థానంలో పోటీ చేయాలని తన కుమారుడికి ఆయన సూచిస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తన కుటుంబ సభ్యులకు చెప్పారు. తాడిపత్రి నుంచి తన కుమారుడు పవన్ గానీ, సోదరుడు జెసి దివాకర్ రెడ్డి గానీ పోటీ చేయాలని ఆయన సూచిస్తున్నారు. కానీ వారిద్దరు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.
తన ఆరోగ్యం సహకరించడం లేదని, తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని గాదె వెంకటరెడ్డి సిఎల్పీ కార్యాలయంలో ఇటీవల మీడియా ప్రతినిధులతో అన్నారు. తన నిర్ణయంపై, తన కుమారుడిని పోటీకి దించితే రాగల ఫలితాలపై ప్రజాభిప్రాయం తెలుసుకుని తనకు తెలియజేయాలని ఆయన బాపట్ల నాయకులకు సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి చాలా క్రితమే ప్రకటించారు. మంత్రులు వట్టి వసంతకుమార్, కాసు కృష్ణారెడ్డి, గంటా శ్రీనివాస రావు వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. వారితో పాటు మరికొంత మంది మంత్రులు కూడా లోకసభకు పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. తమ సంతానాలను అసెంబ్లీ బరిలోకి దింపి తాము లోకసభకు వెళ్లే ఆలోచనలో వారు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications