పార్టీలో గందరగోళం: రోజా, కొండా సురేఖ అసంతృప్తి?

మరోసారి వారిలో అసంతృప్తి జాడలు కనిపిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు నాలుగు రోజులుగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. విజయమ్మ దీక్షలో జగన్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు అందరూ పాల్గొంటున్నారు. అయితే, కొండా సురేఖ, రోజాలు మాత్రం కనిపించడం లేదు. అసలు వారు సంఘీభావం తెలిపేందుకు కూడా రాలేదంటున్నారు.
జగన్, విజయమ్మలు దీక్షలు చేస్తే సురేఖ ఆది నుండి అంతం వరకు వారితోనే ఉంటుంటారు. కానీ, ఇప్పుడు ఆమె రాకపోవడానికి కారణం అసంతృప్తియే కావొచ్చంటున్నారు. గతంలో వరంగల్ జిల్లాలో తమ ఆధిపత్య పోరులో భాగంగా ఆమె అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత ఆమె కూల్ అయ్యారు. అయితే, అసంతృప్తికి గురయ్యారా? లేక ఎన్నికలకు ముందు తెలంగాణపై తేల్చలేదు కాబట్టి సైలెంట్‌గా ఉన్నారా అనే చర్చ సాగుతోంది.
మరోవైపు సినీ నటి, పార్టీ అధికార ప్రతినిధి రోజా కూడా అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో అసంతృప్తికి లోనయినట్లుగా గతంలో ఆమె చెప్పారు. ఆ తర్వాత పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఆమె విజయమ్మ దీక్షలో పాల్గొనకపోవడంతో చర్చ సాగుతోంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుండటం వల్లనే ఆమె దూరంగా ఉండి ఉండవచ్చునని అంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే పార్టీలలో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో పార్టీ ముఖ్యులు కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications