అది జగన్ ఖాతాలోకే..!: విజయమ్మకు వివేకా మద్దతు

అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన చిరస్మరణీయులని, ఆయన మార్గంలో అందరూ నడువాలని సూచించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డారని చెప్పారు. కాగా వారి దీక్ష కొనసాగుతోంది.
తమ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై కొద్దిగా దిగి వచ్చిందన్నారు. 200 యూనిట్లు దాటిన వారిని పెట్టుబడిదారులు అనడం సరికాదన్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ వ్యక్తిగత కారణాలతోనే దీక్ష వద్దకు రాలేదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విషయంలో మీడియా భూతద్దంలో చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఛార్జీలు పూర్తిగా తగ్గించే వరకు దీక్షలు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నామని చెప్పారు.
క్షీణిస్తున్న ఆరోగ్యం
నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తోంది. వారికి ఈ రోజు వైద్యులు వారిని పరీక్షించారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దీక్షకు వైయస్ వివేకానంద రెడ్డి సంఘీభావం తెలిపారు.
అంకెల గారడి
విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అంకెల గారడి ప్రదర్శించిందన్నారు. ఛార్జీలు పెంచింది రెండున్నర రూపాయలైతే తగ్గించింది రూపాయి మాత్రమేనని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ కోతలపై కిరణ్ స్పందించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications