దేవశయని ఏకాదశి చాలా విశేషం.. తులసి దగ్గర ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!

హిందూమతంలో దేవశయని ఏకాదశికి చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. ఆషాడ మాసం లోని ఏకాదశిని దేవ శయని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు నిద్రలోకి జారుకుంటాడు అని, శ్రీ మహా విష్ణువు ఇప్పటి నుండి నాలుగు నెలలపాటు ఆయన నిద్రలోనే ఉంటాడని చెబుతారు. ఇది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కాలం.

దేవశయని ఏకాదశి నుండే చాతుర్మాసం ప్రారంభం

శ్రీ మహా విష్ణువు నిద్రలోకి జారుకున్న నాటి నుండే చతుర్మాసం ప్రారంభం అవుతుంది. ఇక ఈ చాతుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక దేవ శయని ఏకాదశి పండుగ ఈసారి జులై 25వ తేదీన రానుంది. ఆ రోజే విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అయితే ఈ రోజున తులసికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు.

Devashayani Ekadashi is very auspicious don t do this near tulasi on devashayani ekadashi

తులసి విషయంలో ఈ తప్పు చేయకండి

దేవశయని ఏకాదశి రోజున తులసమ్మ విషయంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. లక్షీ స్వరూపంగా భావించే తులసి మాత కూడా నేటి నుండి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుంది. కాబట్టి తులసి మొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొరబాటున కూడా కొన్ని తప్పులు చెయ్యకూడదు. తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు. దేవ శయని ఏకాదశి రోజున తల్లి తులసి విష్ణు కోసం నీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని ఆచరిస్తుంది అని చెప్తారు, అందుకే నీళ్ళను పోయకూడదని చెబుతున్నారు.

తులసి ఆకులు తుంచుతున్నారా? అయితే జాగ్రత్త

దేవ శయని ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకండి. ఒకవేళ ఏకాదశి రోజున తులసీదళాలతో విష్ణువును పూజించాలి అని భావించేవారు, ముందు రోజు సాయంత్రమే తులసి ఆకులను తుంచి పెట్టుకోండి. కానీ ఏకాదశి నాడు తుంచితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. కనుక లక్ష్మీదేవి కోపానికి బలి కాగండి.

నిష్టగా పూజలు చేసేవారు ఏకాదశి నాడు తులసిని అసలే తాకొద్దు

దేవశయని ఏకాదశి రోజున నిష్టగా పూజలు చేసేవారు తులసి చెట్టు చుట్టూ పరిశుభ్రంగా ఉంచండి.పొరపాటున కూడా చెప్పులు ధరించి తులసి చెట్టు వద్దకు వెళ్లకండి.దేవ శయని ఏకాదశి రోజున తులసమ్మకు దూరంగా ఉండండి. ఏకాదశి నాడు తులసి మొక్కను అస్సలు తాకకూడదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+