వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణపై హరికృష్ణ గుర్రు: జూ ఎన్టీఆర్ చిన్నోడేం కాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr-Balakrishna-Harikrishna
వరంగల్: రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వరంగల్ జిల్లాలోని మల్లూరు హేమాచల స్వామి వారిని దర్సించకునేందుకు వచ్చారు. కుటుంబ సమేతంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విలేకరులు ఫ్లెక్సీ రగడపై అడిగినప్పుడు ఆయన స్పందించారు.

చాలా విషయాలపై మీరు అడగాల్సింది చాలా ఉందని, తాము చెప్పాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను వాడుకునే హక్కు అందరికీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విషయాలను పార్టీకి రుద్దవద్దన్నారు. పార్టీలకు, వ్యక్తులకు ముడిపెట్టవద్దని సూచించారు. ఎన్టీఆర్ ఫోటో ప్రతి పేదవాడి ఇంట్లో ఉంటుందన్నారు. అలా వాడుకునే హక్కు అందరికీ ఉందన్నారు.

ఎవరో చేసిన తప్పుకు తన కుటుంబం బలైంది

ఎన్టీఆర్ ఫోటోను ఇతరులు వాడుకుంటే దానిని రాజకీయ వ్యభిచారం అని చెప్పడం విడ్డూరమన్నారు. ఎన్టీఆర్ ఫోటో వాడుకుంటే రాజకీయ వ్యభిచారమంటారా అని ప్రశ్నించారు. అయినా ఎవరో చేసిన తప్పుకు తన కుటుంబం బలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాల పైన తాను చెప్పాల్సింది ఎంతో ఉందన్నారు. రాష్ట్రం బాగుండాలని, దేశం బాగుండాలని అందరూ బాగుండాలని అన్నారు.

జూనియర్‌ను చిన్నోడిగా చూడోద్దు

రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలన్నారు. ప్రజలకు మేలు జరగాలన్నారు. ఎన్నో అంశాలపై ఎందరో అడుగుతున్నారని, సమయం సందర్భం వచ్చినప్పుడు తాను చెబుతానని అన్నారు. పార్టీని బతికించేందుకు ప్రయత్నించాలి కానీ తీవ్ర పరిణామాలు అని చెప్పడం సరికాదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఎవరో పెట్టుకుంటే తన కొడుకు ఎలా బాధ్యుడు అవుతాడన్నారు. బాలకృష్ణ మాటలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు.

జూనియర్‌ను ఇంకా చిన్నవాడిగా భావించవద్దని అన్నారు. ఇప్పటికే తన కుటుంబం బలైందని నవతరం కూడా బలి కావాలా అని ప్రశ్నించారు. ఎవరో చేసిన కుట్రలో తమ కుటుంబం, తమ సంసారం బలైందన్నారు. రామారావు ఫోటో పెట్టుకుంటే రాజకీయ వ్యభిచారం అంటే తీసేసినప్పుడు ఎలా అని ప్రశ్నించారు. టిడిపితోనే ఉంటానని జూనియర్ ఎప్పుడో చెప్పారన్నారు. ఎవరేం చేసినా పార్టీని బతికించుకునే పని చేయాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టిడిపితోనే ఉంటానని చెప్పినప్పటికీ ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడాన్ని హరికృష్ణ తప్పు పట్టారు.

English summary
Telugudesam Party senior leader and MP Nandamuri Harikrishna said on Monday that Hero Junior NTR is not minor. He responded on Flexee politics in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X