హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తేల్చేసిన హరికృష్ణ: జూ. ఎన్టీఆర్, బాలయ్య ఫైట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna-Jr Ntr-Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనూ సోదరుడు బాలకృష్ణతోనూ తలపడడానికే రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య పోరు ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బొమ్మల వాడకంపై హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎన్టీఆర్ బొమ్మలను ఎవరైనా వాడుకోవచ్చునని, పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడాల్సింది చాలా ఉందని హరికృష్ణ అనడాన్ని బట్టి యుద్ధానికి సన్నద్ధమైనట్లే కనిపిస్తున్నారు.

అంతేకాకుండా, ఎవరో చేసిన తప్పులకు తన కుటుంబం బలైందని, నవతరం కూడా బలి కావాలా అని ఆయన అన్నారు. నవతరం అనే మాటను ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అన్నట్లు భావిస్తున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టేందుకు అవసరమైన వ్యూహరచనను హరికృష్ణ చేసుకున్నట్లు చెబుతున్నారు.

తన తండ్రి ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి హరికృష్ణ చంద్రబాబుకు సహకరించారు. అయితే, ఆ తర్వాత తనకు సరైన స్థానం లభించలేదనే అసంతృప్తితో ఉన్నారు. తాజాగా, లోకేష్ వ్యవహారంతో హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఈ వ్యవహారంలో తన వియ్యంకుడు, ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణను చంద్రబాబు చేరదీశారు.

బాలకృష్ణ సహాయంతో ఎన్టీ రామారావు వారసత్వాన్ని మరొకరికి దక్కకుండా చూసుకునే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అయితే, దానికి గండి కొట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. తన వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తన బొమ్మతో పాటు తన తాత ఎన్టీఆర్ బొమ్మను కూడా వాడుకునేలా పావులు కదిపి తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టారని అంటున్నారు.

దైవసన్నిధిలో రాజకీయాలు మాట్లాడడం సరి కాదని, సమయం వచ్చినప్పుడు పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతానని హరికృష్ణ చెప్పడం ద్వారా బహిరంగ యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాను చెప్పాల్సింది చాలా ఉందని కూడా హరికృష్ణ అన్నారు. ఈ మాట ద్వారా తన సోదరుడు బాలకృష్ణకు, బావ చంద్రబాబుకు హెచ్చరికలాంటిది జారీ చేశారని అంటున్నారు.

జూనియర్‌పై చర్యలు తీసుకుంటే..

తన బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడాన్ని ఖండించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బాలకృష్ణ చేసిన హెచ్చరికకు హరికృష్ణ సమాధానం చెప్పారని అనుకోవచ్చు. దానికి సిద్ధపడే ఉన్నామని హరికృష్ణ చెప్పినట్లు భావిస్తున్నారు. ఎవరో చేసినదానికి జూనియర్ ఎన్టీఆర్ బాధ్యుడు కాడని ఆయన చెప్పారు. దాన్నిబట్టి జూనియర్ ఎన్టీఆర్ తన బొమ్మల వాడకాన్ని ఖండించాల్సిన అవసరం లేదని, ఖండించబోడని హరికృష్ణ చెప్పినట్లు భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌పై చర్యలు తీసుకుంటే వెంటనే సమరానికి దిగాలనే ఉద్దేశంతో కూడా హరికృష్ణ ఉన్నట్లు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని బాలకృష్ణ ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అలాంటి అవకాశం కల్పించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదమే కాకుండా ఎన్టీ రామరావు ఫ్లెక్సీల వివాదాన్ని కూడా పెంచి పోషించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏమైనా, తెలుగుదేశం పార్టీలో పోరు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
According to political analysts - Telugudesam Rajyasabha member Harikrishna and his son and nandamuri hero Jr NTR have prepared to fight against Balakrishna and Chandrababu Naidu. Nandamuri Harikrishna's are indicating that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X