ఇదేం అసంతృప్తి?: చిరంజీవిపై ఆజాద్‌కు కిరణ్ ఫిర్యాదు!

Chiranjeevi - Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆయన ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉండగా పలు అంశాలపై నేతలను కలవాల్సి ఉండటంతో సోమవారం కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

కిరణ్ ఈ రోజు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసే అవకాశాలు ఉన్నాయి. కిరణ్ ఆదివారం ముఖ్యమంత్రిలు సమావేశం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత అతను గులాం నబీ ఆజాద్‌ను, పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీని, ఏఐసిసి కోశాధికారి మోతీలాల్ వోరా తదితరులను కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన వారికి కిరణ్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో కిరణ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు చిరంజీవి పైన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో చిరంజీవి బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడాన్ని ఆజాద్ దృష్టికి కిరణ్ తీసుకు వెళ్లారట. ఇటీవల చిరంజీవి, ఆయన వర్గానికి చెందిన మంత్రి సి.రామచంద్రయ్యలు విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాగా, అవిశ్వాస తీర్మానం సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులకు సహజ వాయువును ఇవ్వాలని కేంద్రమ మంత్రి వీరప్ప మొయిలీని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+