క్రైమ్ నోట్స్: లేడీ టెక్కీ అనుమానాస్పద మృతి

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో సోమవారం ఉదయం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే భర్తే ఆమెను హత్యచేశాడని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ వీఆర్వో ఆఫీసు దగ్గర సిటీ సెక్యూరిటీ వింగ్ హెడ్ కానిస్టేబుల్ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు.

ప్రమాదంలో ఇద్దరు మృతి

వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం సాలార్‌తండాలో సోమవారం మధ్యాహ్నం ఓ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

శవమై తేలిన చిన్నారి

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పాముల దిబ్బలో ఆదివారం అదృశ్యమైన చిన్నారి శాంతి మృతదేహం సోమవారం ఉదయం తమ్మిలేరు వాగులో లభ్యమైంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

దోపిడీ దొంగల స్వైరవిహారం

కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడెంలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో మూడు తులాల బంగారం, లక్ష నగదును దుండగులు అపహరించారు. అడ్డుకోబోయిన ఇంటి యజమానిపై దుంగులు కత్తులతో దాడి చేశారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కాంట్రాక్ట్ లెక్చరర్ హత్య

కర్నూలులో రవి అనే కాంట్రాక్ట్ లెక్చరర్ సోమవారం దారుణహత్యకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రవి స్థానికంగా సైదాపూర్ కాలనీలో ఓ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. పేపర్ వాల్యుయేషన్ కోసం ఆదివారం అతను అదివారంనాడు కర్నూలుకు వచ్చాడు. దుండగులు రవి తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు చెబుతున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని మహిళ మృతి

ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. విజయవాడకు చెందిన వెంకటరెడ్డి, పద్మ దంపతులు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దాంతో పద్మ అక్కడికక్కడే మరణించగా, వెంకటరెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. అతన్ని చింతకాని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+