జైపాల్ రెడ్డికి ప్రసాద్ ప్రశంస: రాహుల్‌కు కిరణ్ విజ్ఞప్తి

S Jaipal Reddy-Prasad Kumar
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దూత అమర్ కాలే సోమవారం చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. ఈ రెండు నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అంశంతో పాటు గెలుపోటములపై ఆయన పార్టీ నాయకుల నుండి ఆరా తీశారు. ప్రస్తుతం చేవెళ్ల, మల్కాజిగిరిల నుండి కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అమర్ కాలేతో సమావేశం అనంతరం చేనేత శాఖ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... చెవేళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాలలో తమ పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా వారిని గెలిపించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. చేవెళ్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జైపాల్ రెడ్డి బాగా పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. అధిష్టానం ఎవరి పేరు చెప్పినా తమకు మాత్రం అభ్యంతరం లేదన్నారు.

తెలంగాణ సమస్య క్లిష్టంగా మారినందున దానిని సత్వరమే పరిష్కరించాలని తాము రాహుల్ దూతను కోరినట్లు ప్రసాద్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని తెలంగాణ అంశం వేడెక్కిస్తుందని, కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందన్నారు. అయితే, తెలంగాణను తేల్చితే కాంగ్రెసుకు లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని తాము రాహుల్ దూతకు తెలియజేశామని అన్నారు.

రాహుల్‌ను రాష్ట్రానికి ఆహ్వానించిన కిరణ్

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పలువురు నేతలతో రాష్ట్ర రాజకీయాల విషయం మాట్లాడారు. ఈ సందర్బంగా రాహుల్‌ను కిరణ్ రాష్ట్రానికి ఆహ్వానించారు. రాహుల్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయిన కిరణ్ రాహుల్‌తో భేటీ అనంతరం ఆంటోనీతో చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+