హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితపై పెరుగుతున్న ఒత్తిడి: మంత్రులతో మంతనాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తన పేరును చార్జిషీట్‌లో చేర్చడంతో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిపక్షాలు ఆమె రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆమె ఏం చేయాలనే విషయంపై తన సన్నిహితులతోనూ, ఇతర మంత్రులతోనూ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ తాజా పరిణామంతో చిక్కుల్లో పడినట్లే.

నైతిక బాధ్యత వహించి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. మంత్రులంతా జైల్లో ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులను సిబిఐ జగన్ కేసులో నిందితులుగా చేర్చిందని, తాజాగా, సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్చిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన ఆరోపించారు.

సబితా ఇంద్రారెడ్డి కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవనున్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాదు బయలుదేరి వచ్చారు. ఆయన సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే సబితా ఇంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇదివరకు సిబిఐ అధికారులు సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు. సిమెంట్స్ కంపెనీలకు జలాలను కేటాయించిన వ్యవహారంలో మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. తాజా పరిణామంతో మిగతా మంత్రుల్లో కూడా గుబులు రేగుతోంది.

English summary
Sabitha Indra Reddy may meet CM Kiran kumar Reddy soon. Home minister Sabitha Indra Reddy's name has been included in YSR Congress president YS Jagan case as accused 4. CBI has filed fifth chargesheet in YS Jagan case on Dalmiya cements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X