వైయస్ టిక్కెట్ వద్దన్నా ఇచ్చారు, 5 లక్షలతో విన్: సర్వే

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారనే నమ్మకం తమకుందన్నారు. తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాంగ్రెసులో అసమ్మతి నేతలతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. అసమ్మతి నేతలను విస్మరించవద్దన్నారు. సమన్వయలోపాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మల్కాజిగిరి స్థానాన్ని పలువురు నేతలు ఆశిస్తున్నారని, అయినా తనకే టిక్కెట్ ఇస్తారనే నమ్మకముందన్నారు.
జైపాల్ రెడ్డిపై ఫిర్యాదు
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పైన చేవెళ్ల నియోజకవర్గం నేతలు పలువురు అమర్ కాలేకు ఫిర్యాదు చేశారు. చేవెళ్లకు ఎంతో చేస్తారని ఈ నియోజకవర్గం నుండి జైపాల్ రెడ్డిని గెలిపిస్తే ఆయన గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా నియోజకవర్గానికి రాలేదని వారు ఫిర్యాదు చేశారు. మరోవైపు అమర్‌ను హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి కలుసుకున్నారు.
పాదయాత్రలతో ఒరిగేది లేదు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలల పాదయాత్రలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని మంత్రి కొండ్రు మురళీ శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. ఆ పార్టీలలో వారి కుటుంబాలదే హవా అని విమర్శించారు.












Click it and Unblock the Notifications