వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పెదవి విప్పాల్సిందే: ఎన్టీఆర్ మౌనంతో అనుమానాలు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
గుంటూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఫ్లెక్సీలలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడంపై జూనియర్ స్పందించాలని, ఆయన మౌనం వీడాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు డిమాండ్ చేశారు. జగన్ పార్టీ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ ఏర్పాటు చేసినా ఆయన మౌనం వీడకపోవడం సరికాదని కోడెల ఆక్షేపించారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనం పలు సందేహాలకు తావిస్తోందన్నారు.

గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ మాట అంటే లక్ష్మణ రేఖ అని ప్రపంచం మొత్తానికి తెలుసునని, నాని పార్టీ నుంచి బయటకు వెళ్లడంలో తన ప్రమేయం లేదనో లేక తనకు చెప్పే పార్టీ మారాడనో ఏదో ఒక వైఖరిని జూనియర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్నం పెట్టిన చేతినే తెగ నరికే ధోరణి కలిగిన నాని వచ్చే అసెంబ్లీలో అడుగు పెట్టలేడని కోడెల అన్నారు.

అసలు జగన్ పార్టీ ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ ఫొటోను ఎందుకు ఉపయోగిస్తున్నారో ఆ పార్టీ నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరమైన అభిప్రాయం లేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని విమర్శించారు. ఎన్టీఆర్ పతనానికి, మరణానికి ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతే కారణమన్నారు. ఆమె మనిషే కాదని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు బహిరంగ లేఖ

విద్యుత్తు చార్జీల పెంపు, విద్యుత్తు కోతలను నిరసిస్తూ మంగళవారం (9న) నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా రైతులు, మహిళ లు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలం తా రహదారులపైకి వచ్చి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరారు.

కిరణ్ రాజీనామా చేయాలి: టిడిపి

కళంకిత మంత్రులను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని టిడిపి నేతలు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆదివారం వారు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పరిటాల హత్య కేసు నుంచి వైయస్ జగన్‌ను బయటపడేసేందుకు సహకరించానని ముఖ్యమంత్రే గతంలో చెప్పుకొన్నారని గుర్తుచేశారు. అదేవిధంగా ఇప్పుడు అవినీతి ఆరోపణలున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. అందువల్ల కిరణ్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary

 Telugudesam Party senior leader Kodela Sivaprasad Rao has questioned Nandamuri Hero Junior NTR about his silence over his photos in YSR Congress Party flexees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X