మఠంలో నిప్పంటించుకొని స్వామీజీలు ఆత్మహత్య

bidar chavli math 3 junior seers suicide
బెంగళూరు: కర్నాటకలో దారుణం జరిగింది. ఓ మఠంలోని వివాదాల కారణంగా ముగ్గురు స్వామీజీలు సోమవారం (ఏప్రిల్ 8) ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఈ రోజు ఉదయం తమకు తాము నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌లోని చౌళి మఠంలో చోటు చేసుకుంది.

చోళి మఠానికి సంబంధించి భారీగా ఆస్తులు, భూములు ఉన్నాయి. మఠంపై కన్నేసిన పలువురు స్వామీజీలపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదాల కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆత్మహత్య చేసుకున్న స్వామీజీలు ఓ సూసైడ్ లేఖను కూడా రాసి పెట్టి చనిపోయారు.

మారుతి స్వామి అనే ఓ స్వామిజీ నెల రోజులుగా కనిపించడం లేదు. భూ వివాదాలు, స్వామీజీలు కనిపించక పోవడంపై ఇతర స్వామీజీలు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని చెబుతున్నారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

కొందరు ఈ భూములను తమ వశం చేసుకోవడానికి స్వామీజీలపై ఒత్తిడి తెస్తున్నారని, ఆ కారణంగానే ఇటీవల స్వామీజీలు కనిపించకుండా పోవడం, తాజాగా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మృతులు జగదీష్, ప్రవీణ్, మల్లారెడ్డిలుగా గుర్తించారు. వీరి వయస్సు యాభై, ఇరవై నాలుగు, పదహారేళ్లుగా ఉంది. అయితే, ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+