'సచిన్‌టెండుల్కర్ ఫోర్లలా రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు'

Sachin Tendulkar
విశాఖపట్నం/న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఫోర్ల మాదిరిగానే రాష్ట్రంలో ఫిరాయింపులు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. ఆయన విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నేతలు, శాసనసభ్యులు ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి వెళ్తున్న అంశంపై ఆయన భిన్నంగా స్పందించారు.

సచిన్ టెండుల్కర్ ఫోర్ల మాదిరిగానే రాష్ట్రంలో ఫిరాయింపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకునేందుకు రైల్వే ప్రకటన టైంటేబుల్‌లా ఓ సూచి పెట్టాలని చురకలంటించారు. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన, భద్రత బిజెపి ప్రధాన అజెండా అని ఆయన చెప్పారు.

బిజెపి అగ్రనేతలకు తప్పిన ముప్పు

భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు సోమవారం ప్రమాదం తప్పింది. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, లోకసభా పక్ష నేత సుష్మా స్వరాజ్, పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీలు చార్టెడ్ ఫ్లైట్‌లో బయలుదేరారు. సాంకేతిక కారణాలతో ఫ్లైట్‌ను అత్యవసరంగా ఢిల్లీలోనే ల్యాండ్ చేశారు.

వచ్చే నెల జరుగనున్న ఎన్నికల కోసం కర్నాటకకు బిజెపి అగ్రనేతలు బయలుదేరారు. వీరు చార్టెడ్ ఫ్లైట్‌ను ఢిల్లీలో ఎక్కారు. అయితే, ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ హఠాత్తుగా విమానాన్ని అక్కడే ల్యాండ్ చేశారు. దీంతో వారికి ప్రమాదం తప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+