జైపాల్ రిజైన్ తెలియదు: పొన్నం, సబితపై నో కామెంట్

రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో టిఎంపీలు ఐక్యకార్యాచరణతో ముందుకు వెళ్లాలని అన్నారు. సంసద్ చలో తెలంగాణ బనావో అనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు. అందరం కలిసికట్టుగా పోరాడితే తెలంగాణ సాధ్యమన్నారు. బిజెపి తెలంగాణ ఇవ్వమని కాంగ్రెసును కోరకుండా 2014లో అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి తమతో పాటు పార్లమెంటులో కలిసి రావాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ తన తాజా ఛార్జీషీటులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అంశంపై తానేం స్పందించలేనని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించాలన్నారు. ఆరుగురు మంత్రుల బర్తరఫ్ అంశంపై విపక్షాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారని, దీనిని ముఖ్యమంత్రి చూసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications