వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా మార్కు చూపిస్తా: పర్యాటకంపై చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: దేశ పర్యాటక రంగంపై తన 'మార్కు' ఏమిటో చూపించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి వ్యాఖ్యానించారు. భారత దేశం గురించి, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించటానికి ఉపయోగపడే 'షోకేస్'లాంటిదే పర్యాటక రంగం అని ఆయన అన్నారు. ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరంలోనే వివిధ మెగా సర్కూట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. చిరంజీవి సోమవారం నాడిక్కడ జూబ్లిహాల్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 14 వరకూ హైదరాబాద్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్‌డబ్ల్యుటివో) సదస్సు ఏర్పాట్ల వివరాలను వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి పర్వేజ్ దివాన్, అదనపు కార్యదర్శి గిరీష్ శంకర్, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనా ఖన్ తదితరులు పాల్గొన్నారు.

దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఆయా దేశాల్లో 'స్థిరంగా పర్యాటక అభివృద్ధి' అనే అంశమే లక్ష్యంగా ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. మొత్తం 29 దేశాలకు చెందిన 150 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చిరంజీవి తెలిపారు.

English summary
Union tourism minister Chiranjeevi said that he will show his mark in Tourism sector of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X