వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం అవ్వవచ్చుననే భయమే: చిరుపై కోమటిరెడ్డి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వల్ల కాంగ్రెసు పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం విమర్శించారు. ఆయన నల్గొండ జిల్లా హుజూర్ నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ గురువు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే అన్నారు. తనది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే తత్వం కాదన్నారు. 2014 నాటికి కేంద్రం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తనకుందన్నారు.

వచ్చే ఎన్నికలలోగా కేంద్రం తెలంగాణ ఇవ్వని పక్షంలో తాను కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తనకుందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు చిరంజీవి లేఖ రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. చిరు కాంగ్రెసులో సొంత ఇమేజ్ పెంచుకునేందుకే లేఖలు రాశాలని ఆరోపించారు.

కాంగ్రెసులోని దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు చిరంజీవి వ్యవహార శైలి పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కానీ, చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారేమోననే అభిప్రాయంతో వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనకు కోమటిరెడ్డి కితాబిచ్చారు.

ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల పైన పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అన్నారు. మే చివరికల్లా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వస్తుందనే ఆశాభావాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యక్తం చేశారు.

English summary
Former Minister Komatireddy Venkat Reddy has lashed out at Central Tourism Minister Chiranjeevi for his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X